బాధిత కుటుంబాలకు మంత్రి పరామర్శ

 

జనం పవర్.జగిత్యాల.ఆగష్టు 20

వరదల్లో గల్లంతై మరణించిన జగిత్యాల జిల్లా వాసుల కుటుంబాలను మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డితో కలసి రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరామర్శించారు. జగిత్యాల పట్టణంలోని టిఆర్ నగర్ 47, 48 వ వార్డులకు చెందిన హసీనా సమీనా ఆఫ్రిన్ మహిళలు మహారాష్ట్ర నుండి తిరిగి వస్తుండగా ఉద్గిర్ జిల్లా కేంద్రం సమీపంలో వరదల్లో గల్లంతై మరణించడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. దైవ క్షేత్ర దర్శనాలకు వెళ్లి తిరిగి వస్తున్న సందర్భంలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. మరణించిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చే సహాయంతో పాటు ముఖ్యమంత్రితో మాట్లాడి ఆర్థిక సహాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. భవిష్యత్తులో కూడా ఈ కుటుంబాలకు అండగా ఉంటామని అన్నారు. బాబుకు మెరుగైన వైద్యం అందిస్తాం అని తెలిపారు. మరణించిన కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. చిరు వ్యాపారాలు చేసుకోవడానికి మైనార్టీ వెల్ఫేర్ నుండి రుణ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. మరో మహిళ ఆచూకీ కోసం అక్కడి అధికారులతో మాట్లాడి తొందరలోనే ఆ మహిళ ఆచూకీ కూడా తెలిసే విధంగా చర్యలు చేపడతామని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బాధిత కుటుంబాలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జిల్లా రవి. తిరుపతి. సిరాజ్. నాగేంద్ర తదితర నాయకులు ఉన్నారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :