జగిత్యాలలో ఘనంగా టాటా ఏఐఏ సంకల్ప ర్యాలీ 100 మీటర్ల పొడువాటి జాతీయ జెండాతో ఘనంగా తిరంగా ర్యాలీ ప్రతి ఇంటా జాతీయ జెండా.. ప్రతి ఒక్కరికి జీవిత బీమా బ్రాంచ్ క్లస్టర్ హెడ్ ఎస్. రామకృష్ణారెడ్డి

 

జనం పవర్.జగిత్యాల.ఆగష్టు 20

జగిత్యాల జిల్లా కేంద్రంలో టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ ఆధ్వర్యంలో జీవిత బీమా ఏజెంట్లు, ఉద్యోగులు భారీగా సంకల్ప ర్యాలీ ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా 100 మీటర్ల పొడువాటి జాతీయ జెండాను ప్రదర్శిస్తూ జగిత్యాల పట్టణంలోని ప్రధాన వీధుల గుండా తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రాంచ్ క్లస్టర్ హెడ్ ఎస్. రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ జీవిత బీమా పై ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు.
“దేశభక్తి ఉన్న ప్రతి ఇంట్లో జాతీయ జెండా ఉండాలి.. కుటుంబాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరికీ జీవిత బీమా తప్పనిసరి”ఉండాలని ఉద్దేశంతోనే ర్యాలీ చేసినట్లు తెలిపారు. కుటుంబ పెద్దగా మనపై ఆధారపడిన మన కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలవడానికి ప్రతి ఒక్కరు జీవిత బీమా కలిగి ఉండాలని అన్నారు. ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండి జీవిత బీమా పాలసీలు తీసుకోవాలని తెలిపారు. టాటా ఏఐఏ జీవిత బీమా లో ప్రజల అవసరాలకు తగినట్లుగా అద్భుతమైన సరికొత్త పాలసీలు ఉన్నాయని ప్రజలు ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా కోరారు. ఈ ర్యాలీలో 100 మీటర్ల జాతీయ పతాకాన్ని పట్టుకుని, సుమారు 200 మంది సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. ర్యాలీ టాటా ఏఐఏ ఆఫీసు నుండి ప్రారంభమై టవర్ సర్కిల్, తహసీల్దార్ చౌరస్తా గుండా కొత్త బస్టాండ్ వరకు కొనసాగింది.
ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ శ్రీకాంత్,
బ్రాంచ్ అసిస్టెంట్ మేనేజర్ మహేష్, లీడర్లు సృజన్, గూడెల్లి రాజు, రాగల రాజేందర్, బాపురెడ్డి, పవన్, అనిల్, రవికుమార్, లావణ్య, జయంతి, హరీష్, సాయికృష్ణ, అడ్వైజర్లు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :