మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే

జనం పవర్ – గంగాధర, ఆగస్టు 20

గంగాధర మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలలో సమస్యలు లేవని విద్యార్థులే చెబుతున్నా, సమస్యలు ఉన్నాయంటూ అబద్ధపు ప్రచారం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్‌పై మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా విరుచుకుపడ్డారు.

బుధవారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గురుకుల పాఠశాలను సందర్శించి విద్యార్థుల కోసం వండిన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఆ రోజు చికెన్ కూరతో భోజనం వడ్డించినట్లు, నాన్‌వెజ్ తినని విద్యార్థుల కోసం మిల్ మేకర్ వండినట్లు సిబ్బంది వివరించారు. విద్యార్థులు కూడా భోజనం రుచి, స్నానాలకు నీటి సౌకర్యం, త్రాగునీటి సదుపాయంపై సంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మహేందర్, దోర్నాల శ్రీనివాస్ రెడ్డి, బూరుగు గంగన్న మాట్లాడుతూ –

“మాజీ ఎమ్మెల్యే విద్యార్థులను, సిబ్బందిని భయాందోళనకు గురి చేసి అబద్ధాలు మాట్లాడిస్తున్నారు. రేపు మళ్లీ పాఠశాలకు వస్తే విద్యార్థులకు అందుతున్న నాణ్యమైన భోజనాన్ని చూపిస్తాం” అని సవాల్ విసిరారు.

“ప్రతిరోజు ఏదో అబద్ధపు ప్రచారంతో పేపర్లలో ఫోటోలు వేయించుకోవడం, వాటిని చూసుకొని ఆయన ఆనందపడడం ఆయన పరిస్థితిని చూపిస్తుంది” అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

అదే సమయంలో “పదేళ్లు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిందని, కానీ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థకు పెద్దపీట వేస్తోందని” కాంగ్రెస్ నాయకులు అన్నారు.

గత ఐదేళ్లలో గురుకుల పాఠశాలల అభివృద్ధికి మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేస్తూ, ప్రస్తుత ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో ఏడాదిన్నర కాలంలో జరిగిన అభివృద్ధిని ప్రజల ముందు ఉంచుతామని స్పష్టం చేశారు.

“అబద్ధపు ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తే కాంగ్రెస్ పార్టీ తగిన బుద్ధి చెబుతుంది” అని హెచ్చరించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :