నవభారత నిర్మాత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతోత్సవం

జనం పవర్ జుక్కల్ ఆగస్టు 20 :
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో నవభారత నిర్మాత మాజీ ప్రధాని భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశాన్ని ప్రపంచంతో పోటీపడేలా మార్చిన దూరదృష్టి గల నాయకుడు రాజీవ్ గాంధీ అని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ధర్పల్ గంగాధర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు సాయిని అశోక్, అజయ్ పటేల్, రాష్ట్ర యువజన నాయకులు విజయ్ భాస్కర్ రెడ్డి, గౌస్ సెట్,లింగురాం, చింతల్ హన్మాండ్లు,గంగారం సార్, ఖలీల్ తదితరులు ఉన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :