షాట్‌పుట్‌లో రోహిత్‌కు ద్వితీయ బహుమతి

 

జనం పవర్, మంథని, ఆగస్టు 16:
మంథని లోని తెలంగాణ సామాజిక సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాలలో 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీల్లో దార రోహిత్‌ షాట్‌పుట్ విభాగంలో ద్వితీయ బహుమతిని సాధించి సిల్వర్ మెడల్‌ గెలుచుకున్నాడు. రాష్ట్ర గురుకులాల పేరెంట్స్‌ అసోసియేషన్‌ (టిజిపిఏ) రాష్ట్ర ఉపాధ్యక్షులు, రాష్ట్ర నిజ నిర్ధారణ కమిటీ కన్వీనర్‌, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్‌ఛార్జి, మంథని గురుకుల పేరెంట్స్ కమిటీ చైర్మన్‌ దార మధు కుమారుడైన రోహిత్ ఈ బహుమతిని ప్రిన్సిపాల్‌, తండ్రి చేతుల మీదుగా స్వీకరించాడు. ఈ సందర్భంగా దార మధు మాట్లాడుతూ తన కుమారుడికి స్వయంగా బహుమతి ప్రదానం చేయడం ఎంతో సంతోషంగా ఉందని, పిల్లలు చదువులోనూ క్రీడల్లోనూ విజేతలుగా నిలిస్తే తల్లిదండ్రులకు దానికన్నా పెద్ద ఆనందం లేదని అన్నారు. ఈ విజయానికి కృషి చేసిన పీడీ బి.రమేశ్‌, పీఈటీ పి.పుష్పలతలకు కృతజ్ఞతలు తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :