జనం పవర్, వరంగల్ ఆగస్టు 16:
వరంగల్ రంగంపేట ఇవాంజికల్ బాప్టిస్ట్ చర్చి 60 సంవత్సరాల వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీవీ ప్రసంగీకులు రెవరెండ్ డాక్టర్ టి డి ప్రసన్నకుమార్ రెవరెండ్ డాక్టర్ జి నిరంజన్ బాబు,వై ఆనంద్ కుమార్, ఇవాంజికల్ బాప్టిస్ట్ చర్చి చైర్మన్ పాస్టర్ బి రవిప్రసాద్, బ్రదర్ పి భక్తి సింగ్ లు హాజరై మాట్లాడాతూ.. రంగంపేటలో ఇవాంజికల్ బాప్టిస్ట్ చర్చి ఒక చిన్న సంఘముగా ఏర్పడి అనేకమైన కష్టాలను ఓర్చుకొని అంచలంచలుగా ఎదిగి 60 సంవత్సరాల వజ్రోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించుటకు దేవునికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. సంఘంలో ఉన్న సభ్యులందరూ బాధ్యతగా అనేక గ్రామాలలో పట్టణాలలో ఏసుక్రీస్తు సువార్తను ప్రకటించుటకు సైనికులాగా పని చేయాలని సూచించారు. అదేవిధంగా సంఘ అభివృద్ధికి పాటుబడిన పాస్టర్లు ఎస్పీ సైమన్, జెడి ఎడ్వార్డులు, సంఘస్తులు కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా భవిష్యత్ తరాలకు దీవెనకరంగా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుని వేడుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ మెంబర్స్, పుల్ల అనిల్, అశోక్, సందీప్, సామేల్, పి జాన్, సంఘస్తులు తదితరులు పాల్గొన్నారు.









