జనం పవర్, వనపర్తి, ఆగష్టు : 16 :
వనపర్తి పట్టణ కేంద్రంలో ఉన్న ఇందిరా పార్క్ ప్రస్తుతం సంబంధిత మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్ల అపరిశుభ్రంగా మారి దుర్వాసన వెదజల్లుతుంది . ఈ పార్క్‌లో ప్రతిరోజూ వృద్ధులు, వికలాంగులు ముఖ్యంగా పిల్లలు సేద తీరుటకు వస్తున్నారు. కానీ ఇక్కడ శుభ్రత లేకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అందువల్ల, ప్రజల ఆరోగ్యం, శుభ్రమైన వాతావరణం దృష్టిలో ఉంచుకొని వెంటనే పార్క్‌లో శుభ్రత కార్యక్రమాలు చేపట్టవలసిందిగా ప్రజలు కోరుతున్నారు. నిత్య వినోదానికి, విశ్రాంతికి ఉపయోగపడే ప్రదేశంగా ఉంది. ప్రతి రోజు పలు వయస్సుల గల ప్రజలు ఈ పార్క్ కు వచ్చి సేద తీరుతున్నారు.అయితే, ఇటీవల కొన్ని రోజులుగా ఈ పార్క్ ప్రాంగణంలో చెత్త వదలడం, ప్లాస్టిక్ ఇతర వ్యర్థాలు పార్క్ ను దుస్థితికి గురిచేస్తున్నాయి. పార్క్ లో కూర్చోవడానికి ఉన్న బెంచీలు కూడా ధ్వంసమవుతూ ఉన్నాయి. దీని వల్ల ప్రజలకు అసౌకర్యం కలుగుతోంది.
పార్క్ పరిసరాలను పర్యవేక్షించాల్సిన మున్సిపాలిటీ అధికారులు దీన్ని పట్టించుకోకుండా ఉంచడంవల్ల, ఆరోగ్య పరంగా ఈ పర్యావరణ పరంగా ప్రమాదాలు ఎదురవు తుంటున్నాయి. సకాలంలో శుభ్రత నిర్వహణకు సంబంధిత సిబ్బందిని నియమించాలని ప్రజలు కోరుతున్నారు.









