వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి — నెన్నెల ఎస్సై ప్రసాద్

 

జనం పవర్,బెల్లంపల్లి: ఆగస్టు 16:

భారీ వర్షాల కారణంగా ప్రజలు జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని నెన్నెల ఎస్సై ప్రసాద్ ప్రజలను కోరారు. భారీ వర్షాలతో మండలంలోని పలు చోట్ల రోడ్లపై నుంచి, కల్వర్టుల నుండి వరద ప్రవహిస్తుందన్నారు. ప్రజలు బయటకు రావొద్దని, గ్రామాల్లోని ప్రజలు శిథిలావస్థకు చేరిన ఇళ్ల నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. కల్వర్టు రోడ్లపై వరద ప్రవాహం ఉన్నపుడు దాటడానికి సాహసం చేయొద్దని పేర్కొన్నారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని చెప్పారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :