జనంపవర్, భీమదేవరపల్లి, ఆగస్ట్ 16
అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అగ్రస్థానంలో నిలిపేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం వికసిత తెలంగాణ 2047 తో ముందుకు సాగుతోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి కేతిరి లక్ష్మారెడ్డి అన్నారు. శనివారం ముల్కనూర్ లో ఆయన విలేఖరులతో మాట్లాడారు. ఎన్నికల హామీల అమలులో భాగంగా మహాలక్ష్మి పథకం ద్వారా 2.39 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ద్వారా జిల్లాలో 110.75 కోట్ల లబ్దిని పొందారని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ళ పథకంలో భాగంగా హుస్నాబాద్ నియోజకవర్గం వ్యాప్తంగా గూడులేని పేదలు తమ సొంతింటి కలను నెరవేర్చుకుంటున్నారని ఈ దశలో గ్రామాల్లో నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం రైతులకు రుణ మాఫీ చేసిందని, గత రబీ సీజన్ లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా మద్దతు ధరతో పంటను ప్రభుత్వం కొనుగోలు చేసిందని తెలిపారు. కొత్త రేషన్ కార్డుల పంపిణీ, రెవెన్యూ సదస్సుల ద్వారా రైతుల సమస్యల పరిష్కారం, కులగణన సర్వే చేపట్టి నాస్ లో 50 లోపు ర్యాంకును తెలంగాణ సాధించిందని చెప్పారు. ప్రజాపాలనలో పేదింట సంతోషాలు నింపడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని కొనియాడారు. ఓర్వలేని తనంతో విమర్శలు చేస్తున్న బారాస పార్టీకి రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని కేతిరి లక్ష్మారెడ్డి జోస్యం చెప్పారు.









