మంచిర్యాలలో కుండపోత వర్షాలు.. లోతట్టు ప్రాంతాలు జలమయం

జనం పవర్, మంచిర్యాల ఆగస్ట్ 16:

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వాతావరణ శాఖ రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. శనివారం, మంచిర్యాలలో కుండపోత వర్షాలు.. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. శనివారం మంచిర్యాల జిల్లా లోని నస్పూర్, జైపూర్, భీమారం, మందమర్రి, మండలాల్లోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయని, దీంతో లోతట్టు ప్రాంతాలు మరియు రోడ్లు నీట మునిగాయి. కొన్ని ప్రాంతాలు సముద్రంల తలపిస్తున్నాయి. ఉదయము 6 సమయం నుండి కురిసిన వానలకు ప్రయాణికులు మరియు రైతు కూలీలు
భవన నిర్మాణ కార్మికులు పనులు నిలిచిపోయి ఇబ్బందులకు గురయ్యారు.
ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని, ఉరుములు-మెరుపులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :