మందమర్రి వాడల్లో వరద- రోడ్డంతా.. బురద, ఉంటే విపరీత ఎండలు ,లేదంటే భారీ వర్షాలు, కాలం మారింది కాలనీలు నింపడానికేనా.. అంటున్న ప్రజలు

జనం పవర్ న్యూస్, మందమర్రి, శనివారం, ఆగస్టు 16:

మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో శుక్రవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షం కారణంగా..
మందమర్రి పట్టణం అదేవిధంగా మండలంలోని పలు గ్రామాలు మొత్తం నీటిమయమయ్యాయి. అంతేకాకుండా.. పంట పొలాలు మొత్తం నీటమునిగాయి. ఇవే కాకుండా.. మండలంలోని గుడిపల్లి ,వెంకటాపూర్ గ్రామాల మధ్య ఉన్న ప్రధాన దారి పై, కల్వర్టు కిందికి ఉండడం వల్ల ,వర్షం నీరు భారీగా చేరి దారి రాకపోకలు మూడు గంటల పాటు అటు నుండి ఇటు నుండి అటు బంద్ అయి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ ప్రధాన దారిపై నిర్మించిన కల్వర్టు లను తొలగించి ,ముందుచూపుతో.. ప్రస్తుతం ఉన్న దారి కంటే ఎత్తుగా కల్వర్టు నిర్మించాలని ఇక్కడి ప్రజలు అభిప్రాయ పడుతున్నారు. అంతే కాకుండా.. పంట పొలాలు మొత్తం నీటి మునిగాయి ,శంకరపల్లి గ్రామంలో ఇండ్ల చుట్టూ‌.. నీరు చేరి ,ఇంటి బంధికానా చేశాయి .మందమరి పట్టణంలో మూడోవ జోన్, ఎనిమిదో వార్డు లో ఇండ్లలోకి నీరు చేరి, పిల్లలు చదువుకునే పుస్తక బ్యాగులు కూడా నీట మునిగాయి, ఇదే కాలనీలో గతంలో మట్టితో నిర్మించిన కొన్ని ఇండ్లు కూడా కూలడానికి సిద్ధంగా ఉన్నాయి. అంతేకాకుండా ..పట్టణంలోని ఇందు గార్డె న్స్, పలు కాలనీలు నీటమునిగిపోయాయి.


ప్రధానంగా ..రెండో జూన్ భాగ్యనగర్ కాలనీ ఇళ్లలోకి నీరు భారీగా చేరి ,వర్షాలు కురిసినప్పుడల్లా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి ..పట్టణ అదేవిధంగా.. పల్లె ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
దీనికి ముఖ్య కారణం.
సింగరేణి కాలనీలు అయినటువంటి 1,2 జోన్ లో ప్రధాన కాలువలలో మట్టి, భారీగా చేరి , మురికి కాలువలో చెట్లు పేరుకుపోవడం రోడ్లపై ఉన్న నీరు ప్రయాణం చేయకుండా అటుపడుతున్నాయి, ఈ విషయంలో సింగరేణి అధికారులు పట్టించుకోకపోవడం ప్రధాన కాలనీలకు వెళ్ళు మార్గంలో.. చిన్న – చిన్న కల్వర్టులు ఉండటం వల్ల ,రెండు ,మూడు కూడళ్లలో ..భాగ్యనగర్ కాలనీ వెళ్లే ప్రధాన రహదారి వద్ద కల్వర్టు నిర్మించకపోవడం ముఖ్య కారణం.

దీనిపై మున్సిపల్ కమిషనర్ కు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడం ద్వారా ..కమిషనర్ వెంటనే కాలనీలను స్వయంగా పర్యటించి, సమస్యను తెలుసుకోవడం వాటిని పరిష్కారం చేస్తామని చెప్పడం అభినందనీయం.
సింగరేణి అధికారులు కనీసం సమస్యలపై స్పందించకపోవడం అంతేకాకుండా.. క్లిష్ట సమయంలో కాలనీలను పర్యటించకపోవడం ,సమస్యలు తెలుసుకోకపోవడం, ఇక్కడి ప్రజల సమస్యలను పట్టించుకోకపోవడం, సింగరేణి అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిలువెత్తు సాక్ష్యం, ఈరోజు వరదలపై
ఇప్పటికైనా .. సింగరేణి జిఎం వెంటనే స్పందించి వరద సమస్యలు, ఖాళీ ఇండ్లలోకి నీరు రావడం అరికట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :