కందర్పల్లి ఎంపీపీఎస్ కు 2 ల్యాప్టాపుల విరాళం

జనం పవర్, జుక్కల్ ఆగస్టు 15 :

విద్యా రంగంలో ఆధునిక సాంకేతికతను అందించి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను చేరువ చేయాలనే లక్ష్యంతో ప్రొమైండ్స్ స్కిల్ క్యాటలిస్ట్ సంస్థ కందర్పల్లి ప్రాథమిక పాఠశాలకు రెండు ల్యాప్టాప్లను విరాళంగా అందజేసింది.ఈ సందర్భంగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గంగాధర్ మాట్లాడుతూ, త్వరలోనే పాఠశాలలో ‘ఫ్యూచర్ స్కిల్స్ ల్యాబ్’ ను స్థాపించనున్నట్లు తెలిపారు. ఈ ల్యాబ్ ద్వారా విద్యార్థులు 21వ శతాబ్దానికి అవసరమైన నైపుణ్యాలు డిజిటల్ లిటరసీ, కోడింగ్, సృజనాత్మక ఆలోచన వంటి అంశాలను నేర్చుకొనే అవకాశం పొందనున్నారు. “గ్రామీణ ప్రాంతాలలోని ప్రతి విద్యార్థి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు సాగాలి అనేది మా ప్రధాన లక్ష్యం” అని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ పెద్దలు,గ్రామ ప్రజలు,పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :