ప్రజా సమస్యలపై ఉద్యమిస్తాం — సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి భూమేశ్వర్

 

జనం పవర్.జగిత్యాల.ఆగష్టు 16

ప్రజా సమస్యలపై ఉద్యమిస్తామని 2 వ సారి ఏకగ్రీవంగా ఎన్నికైన జగిత్యాల జిల్లా సిపిఐ సహాయ కార్యదర్శి ఇరుగురాల భూమేశ్వర్ పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా పెగడపెల్లి మండలం కీచులాటపల్లి గ్రామానికి చెందిన భూమేశ్వర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎఐఎస్ఎస్ ఉద్యమంలో పనిచేసి 2 సార్లు ఎఐఎస్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. అలాగే విద్యార్థి సంఘం నుండి ఎఐవైఎస్ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా 2 సార్లు పనిచేశారు. ఉమ్మడి జిల్లాలో విద్యార్థి సంఘం లో పనిచేసి విద్యార్థుల సమస్యలపై, యువజన సంఘం లో యువకుల హక్కుల కోసం ఉద్యమించారు. అలాగే ఎ ఐ టి యు సి జిల్లా నాయకునిగా కార్మికుల పక్షాన ఆనేక ఉద్యమాలు నిర్వహించారు. కార్మికులకు అండగా నిలిచి వారికి మనో ధైర్యాన్ని కల్పించడం, దానితోపాటే నూతన జిల్లాలు ఏర్పాటు చేయడం మూలంగా సొంత జగిత్యాల జిల్లాలో కమ్యూనిస్ట్ పార్టీ బలోపేతానికి కృషిచేస్తు పార్టీలో జిల్లా సహాయ కార్యదర్శి గా 2 వ సారి ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. జిల్లాలో కమ్యూనిస్ట్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తాననీ బడుగు బలహీన వర్గాల ప్రజలు కోసం ఉద్యమిస్తామని నా పైనా నమ్మిక వుంచి 2 వ సారి ఏకగ్రీవంగా ఎన్నుకున్న పార్టి నాయకులకు భూమేశ్వర్ ధన్యవాదాలు తెలిపారు. నా ఎన్నిక కోసం కృచిచేసిన పార్టీ అగ్రనాయకత్వం సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులుమాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ చాడ వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ కలవేని శంకర్ లకు పార్టీ నాయకులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :