జనం పవర్, పెద్దపల్లి ఆగస్ట్ 16:
అఖిల భారత యాదవ మహాసభ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు మేకల మల్లేశం యాదవ్ అధ్యక్షతన యాదవ చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, అఖిల భారత యాదవ మహాసభ జాతీయ కమిటీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న రెజంగ్ల రజ్ కలశ యాత్ర ఈనెల 18న ఉదయం 10 గంటలకు పెద్దపల్లి జిల్లాలోకి ప్రవేశించి, ఉదయం 11 గంటలకు పెద్దపల్లి జెండా చౌరస్తా చేరుకొని అక్కడి నుంచి బస్టాండ్ వరకు యాత్ర కొనసాగుతుందని తెలిపారు. 1962లో భారత–చైనా యుద్ధంలో వీరమరణం పొందిన 114 మంది యాదవ సైనికుల త్యాగ స్ఫూర్తిని స్మరించుకుంటూ, వారి రక్తంతో కలిసిన మట్టిని కలశంలో వేసుకొని దేశవ్యాప్తంగా పర్యటిస్తూ అహిర్ రెజిమెంట్ పునరుద్ధరణకు అవగాహన కల్పించడం ఈ యాత్ర ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. యాదవుల శౌర్యాన్ని ప్రతిబింబించే ఈ యాత్రలో పెద్దపల్లి జిల్లా యాదవులు తప్పక పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా స్థాయి యాదవ మహాసభ నాయకులు, ట్రస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు.









