జనం పవర్, మంథని, ఆగస్టు 16:
ఈనెల 20న మంథని లో జరిగే వికలాంగుల, వృద్ధుల, వితంతువుల, ఒంటరి మహిళల, చేయూత పెన్షన్ పెంపు కొరకు తలపెట్టిన సన్నాహక సదస్సును విజయవంతం చేద్దాం
శనివారం మంథని నియోజకవర్గం లో ఎమ్మార్పీఎస్, విహెచ్పిఎస్ వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో వృద్ధులు, వితంతువులు, వికలాంగుల పెన్షన్ దారుల సమావేశం పలు గ్రామాలలో నిర్వహించడం జరిగినది.తెలంగాణలోని వికలాంగుల, వృద్ధుల, వితంతువుల, ఒంటరి మహిళల , నరముల బలహీనత కలిగిన వారందరికీ ఆసరా పింఛన్లు పెంపుదల చేయాలని మందకృష్ణ మాదిగ నాయకత్వంలో జరుగుతున్న ఈ ఉద్యమంలో భాగంగా సెప్టెంబర్ 9న హైదరాబాదు లో నిర్వహించ తలపెట్టిన వికలాంగుల,వృద్ధుల, వితంతువుల, ఒంటరి మహిళల ఆసరా పెన్షన్ల పెంపు చేయాలని డిమాండ్ చేయనున్నారు.
బహిరంగ సభను విజయవంతం చేయడంలో భాగంగా నియోజవర్గాల వారీగా జరుగుతున్న సన్నాహ సదస్సుల్లో భాగంగా ఈనెల 20న మంథని లో జరిగే సభను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకులు పిలుపునిచ్చారు.









