శాంతి వనం లో కలిమి కాయలు

జనం పవర్, వరంగల్ ఆగస్టు 16:
వర్షాకాలం లో కాసే కలిమి కాయలు ఈసారి శాంతి వనం లో విరగ కాసాయి.
వీటిని కలిమి కాయలు, వాక్రాయలు, కరొండ అనే పేర్లతో పిలుస్తారని వన ప్రేమి గోకా రామస్వామి అన్నారు. వీటిని రోటి పచ్చడి గానే కాక నిలువ పచ్చడి కూడా చేస్తారని తెలిపారు. కిలో 50 రూపాయలున్న టమాట బదులు ఐదు, ఆరు కాయలు పప్పు లో వేసుకుంటే ఆ రుచే వేరని అన్నారు. ఇందులో “సి” విటమిన్ పుస్కలంగా ఆరోగ్య ప్రదాయిని గా ఉపయోగ పడుతుందని గోకా రామస్వామి అన్నారు.
వ్యవసాయదారులు ఈ మొక్కలను జీవ కంచెగా చేను చుట్టు వేస్తారని, వీటికి ఉన్న మూడు ఇంచుల ముల్లుల వలన పాములు కూడా చొరబడవని గోకా అన్నారు. శాంతి వనం కొరకు తేవడం జరిగిందని, నేడు విరగ బూసిన కాత తో శాంతి వనానికి అందం తెచ్చాయని గోకా రామస్వామి తెలియజేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :