జనం పవర్, వరంగల్ ఆగస్టు 16:
మధ్య భారతంలో ఆపరేషన్ కగార్ ను ఆపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ.. ఆదివాసి హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఆధ్వర్యంలో ఈనెల 24వ తేదీన హనుమకొండ లోని అంబేద్కర్ భవన్లో జరుగు రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని వేదిక భాగస్వామ్య పక్షాల నాయకులు శనివారం ఖిలా వరంగల్ పడమర కోట అంబేద్కర్ విగ్రహం వద్ద పోస్టర్ ఆవిష్కరించారు.ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ గ్రేటర్ వరంగల్ కమిటీ కార్యదర్శి రాచర్ల బాలరాజు హాజరై మాట్లాడుతూ.. ఈ సదస్సు ఉదయం పది గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందని పౌర హక్కుల సంఘం, రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ అధ్యక్షత వహిస్తారని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ హనుమకొండ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ భాస్కర్ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు జేవి చలపతిరావు ప్రొఫెసర్ హర గోపాల్ డి నరసింహారెడ్డి పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ నారాయణరావు తదితరులు మాట్లాడుతారని తెలియజేశారు.ఈ సందర్భంగా ఐ ఎఫ్ టి యు జిల్లా అధ్యక్షులు గంగుల దయాకర్ మానవ హక్కుల వేదిక జిల్లా నాయకులు బండి కోటేశ్వరరావు పిడిఎం జిల్లా అధ్యక్షులు గుడికందుల క్రాంతి సి ఎల్ సి జిల్లా నాయకులు కాంపల్లి ప్రవీణ్ టిడిఎఫ్ నాయకులు పోరిక ఉదయ్ సింగ్ లు మాట్లాడుతూ.. మధ్య భారతంలో అమలు చేస్తున్న ఆపరేషన్, కగార్ ను ఆపివేయాలని 1996 పీసా చట్టం మరియు 2006 అటవీ హక్కుల చట్టం ను అమలు చేయాలని మావోయిస్టులు ఆదివాసులపై జరుగుతున్న హత్యాకాండను ఆపివేయాలని బస్టర్ లో ఏర్పాటు చేసిన సాయుధ పోలీస్ క్యాంపులను ఎత్తివేయాలని ఉద్యమకారుల ఆదివాసుల జీవించే హక్కును రక్షించాలని కేంద్రం కాల్పుల విరమణ ప్రకటించి మావోయిస్టులతో చర్చలు జరపాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మానవ హక్కుల వేదిక జిల్లా నాయకులు పాలకుర్తి సత్యనారాయణ, అరుణోదయ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నలిగంటి విజయ్ పాల్, ఏఐఎఫ్ టి యు జిల్లా అధ్యక్షులు భైరబోయిన ఐలయ్య, పి వై ఎల్ జిల్లా నాయకులు గండ్రతి హరిబాబు, ఏఐకేఎంఎస్ కార్యవర్గ సభ్యులు ఇనుముల కృష్ణ, గద్దల సంజీవ తదితరులు పాల్గొన్నారు.









