జనంపవర్, భీమదేవరపల్లి, ఆగస్ట్ 16:
వానల వేళ విద్యుత్ స్తంబాలు, ట్రాన్స్ ఫార్మర్లు, ప్యానెల్ల వద్దకు వరద నీరు చేరితే అటుగా వెళ్ళవద్దని టి జి ఎన్ పి డి సి ఎల్ అధికారులు సూచిస్తున్నారు. వానలకు తడిసిన స్తంబాలను పట్టుకుని ప్రమాదాల బారిన పడిన వారిని మనం తరచూ చూస్తున్నాం. ఇళ్లకు ఎర్థింగ్ చేయించుకోకుండా ఇంటి లోపల ఫ్రిజ్ లేదా టివి స్విచ్చులు వేసినపుడు విద్యుత్ షాక్ తో ప్రాణాలు పోతుందటం కూడా వింటున్నాం. విద్యుత్ సిబ్బంది సైతం బూట్లు ధరించకుండా స్తంబాలు ఎక్కి విగతాజీవులుగా మారడం నిత్యం ఎక్కడో ఒకచోట కనపడుతూనే ఉంటుంది. ప్రధానంగా వర్షాలు కురిసినప్పుడు అప్రమత్తం గా ఉండటంతో పాటు సమయస్ఫూర్తిగా వ్యవహరించడం ముఖ్యమని విద్యుత్ అధికారులు సూచిస్తున్నారు.
ఇవి పాటిస్తే మేలు
విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్, స్తంభం చుట్టూ నీరు చేరితే దాంట్లోకి నడవొద్దు. ఆ నీటిని తాకవద్దు.తడి చేతులతో స్తంబాలు, చెట్లు, ఇనుప కంచెలను తాకడం మరింత ప్రమాదం. వీధుల్లో స్తంభాలకు కింది భాగంలో ఉన్న ఫ్యూజ్ బాక్సులకు దూరంగా ఉండాలి. అవసరమైతేనే కర్రలు, ప్లాస్టిక్ స్టిక్కు తో స్విచ్చులు వేయాలి. విద్యుత్ ప్యానెల్ల వద్దకు వరద చేరితే వెంటనే ట్రాన్స్ ఫార్మర్ వద్ద స్విచ్చును ఆపేయాలి. లేదంటే స్థానిక లైన్ మెన్ కు సమాచారం ఇవ్వాలి. ప్యానెల్లు ఎలివేటెడ్ ఫ్లాట్ ఫారం పై ఏర్పాటు చేసి ప్యానల్ బోర్డుకు వాటర్ ప్రూఫ్ తలుపులు బిగించాలి. మోటార్ వద్ద సబ్ మెర్సీబుల్ పంపులు ఏర్పాటు చేసినపుడు భూగర్భం లోకి వరద చేరితే వెంటనే మెయిన్ లేదా విద్యుత్ నియంత్రిక వద్ద ఎబి స్విచ్ ఆపేయాలి. నీరు చేరని సురక్షిత ప్రదేశంలో మాత్రమే జనరేటట్, ఇన్వెర్టర్ ఏర్పాటు చేసుకోవాలి. వర్షం కురుస్తున్న సమయంలో విద్యుత్ తీగలు, ట్రాన్స్ ఫార్మర్లకు దూరంగా ఉండాలి. ఇళ్ల వైరింగ్ లో తేడాలు ఉన్నా, ఎలక్ట్రీ షియాన్ తప్పిదాలు, కాలం చెల్లిన విద్యుత్ సామాగ్రితో విద్యుత్ షాక్ కొడితే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. ఎర్థింగ్ చేయించుకుంటే సరఫరాలో ఏదైనా సమస్య తలెత్తితే ఎంసిబి ట్రిప్పు అవుతుంది. తద్వారా ప్రమాదం నివారించవచ్చు.మేడలపై బట్టలు ఆరెసుకునే తీగల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వీటిని విద్యుత్ తీగలకు తగలకుండా చూసుకోవాలి. విద్యుత్ సిబ్బంది సైతం చేతులకు గ్లౌజులు, హెల్మెట్, గమ్ బూట్లను ధరించి స్తంబాలు ఎక్కడం, ట్రాన్స్ ఫార్మర్ల వద్ద ఫ్యూజులు మార్చడం చేయాలి. గతంలో మాదిరి కాకుండా ఇప్పుడు బహుళ అంతస్తుల నిర్మాణాల నేపథ్యంలో భవనాల ముందే ట్రాన్స్ ఫార్మర్లు బిగిస్తున్నారు. ఆ భవనాల ప్రహరీలు ఆనుకొని రహదారుల్లోనే ఏర్పాటు చేయడంతో సెల్లార్ ప్రదేశంలో ఆడుకునే పిల్లలకు ప్రమాదం పొంచి ఉంది. పెద్దలు వారిని ఓ కంట కనిపెట్టాలని అధికారులు సూచిస్తున్నారు. గాలులు వీయడం, ఉరుములు, వానలు కొనసాగిన సమయంలో పిల్లలను బయటకు అనుమతించవద్దని అధికారులు అంటున్నారు









