బీజేపీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ

గంగాధర జనం పవర్ ఆగస్టు 15 :

గట్టు బుత్కూర్ గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. 47వ బూత్ అధ్యక్షుడు కోక్కుల శ్రీధర్ గణేశ్ గద్దె వద్ద పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీధర్, పార్టీ సిద్ధాంతాలను ప్రతి ఇంటికి చేర్చే దిశగా కృషి చేస్తానని తెలిపారు. గ్రామ అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారం కోసం బీజేపీ ఎప్పుడూ ముందుంటుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో బూత్ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :