జనం పవర్ – గంగాధర, ఆగస్టు 11:
చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం ఆదేశాల మేరకు గంగాధర మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పల్లె పల్లెకు జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పురుమల్ల మనోహర్ సమన్వయంతో, సోమవారం (11/08/2025) ఉదయం నుంచి పలు గ్రామాల్లో జెండా ఆవిష్కరణలు జరిగాయి.
ఉదయం 9:00 గంటలకు ముప్పిడి పల్లిలో, 9:30 గంటలకు సర్వారెడ్డి పల్లిలో, 10:00 గంటలకు నర్సింహులపల్లిలో, 10:30 గంటలకు బూర్గుపల్లిలో, 11:00 గంటలకు లింగంపల్లిలో, 11:30 గంటలకు ర్యాలపల్లిలో కాంగ్రెస్ జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
గ్రామాలంతా కాంగ్రెస్ జెండాలతో కళకళలాడగా, నినాదాలతో ఘోషణలు మార్మోగాయి. గ్రామస్తులు పార్టీ పతాకం ఎగురవేసిన అనంతరం, ఐక్యతతో ముందుకు సాగాలని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించాలని నాయకులు పిలుపునిచ్చారు. కార్యక్రమాల విజయవంతానికి కృషి చేసిన అన్ని నాయకులు, కార్యకర్తలకు పురుమల్ల మనోహర్ కృతజ్ఞతలు తెలిపారు.













