జనం పవర్ – గంగాధర, ఆగస్టు 11:
న్యాలకొండపల్లి H/o కొండన్నపల్లి గ్రామంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం, శివాలయంలో దొంగతనం జరిగింది. నిన్న రాత్రి గుర్తు తెలియని దొంగలు రెండు గుళ్ల తాళాలు, హుండీలు పగులగొట్టి అందులోని సుమారు రూ.6,000 నగదు ఎత్తుకెళ్లారు. ఈ విషయమై ఆలయ ఇన్చార్జి మేడిచెల్మల రాజు (38), S/o లచ్చయ్య, R/o న్యాలకొండపల్లి ఫిర్యాదు చేయగా, గంగాధర పోలీస్ స్టేషన్ ఎస్ఐ బి. వంశీ కృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Post Views: 67









