జనం పవర్ – గంగాధర, ఆగస్టు 11:
గంగాధర పోలీస్ స్టేషన్లో జమ్మూకశ్మీర్‌కు చెందిన లారీ డ్రైవర్ గంజాయి మత్తులో వీరంగం సృష్టించి పలువురికి గాయాలు కలిగించాడు.
సమాచారం ప్రకారం, కరీంనగర్లో యాపిల్స్‌ను మార్కెట్లో దింపి తిరుగు ప్రయాణంలో ఉన్న డ్రైవర్, గంజాయి సేవించి లారీ ఓనర్‌తో వాగ్వాదం ప్రారంభించాడు. ఈ గొడవ తర్వాత గంగాధర పోలీస్ స్టేషన్లో కొనసాగి, అక్కడే ఇద్దరూ కొట్లాటకు దిగారు. వారిని ఆపేందుకు వచ్చిన మరికొందరికి కూడా గాయాలయ్యాయి.
మత్తులో విచక్షణ కోల్పోయిన డ్రైవర్, ఓనర్‌ను గోళ్లతో రక్కి గాయపరిచాడు. అనంతరం పోలీసులు డ్రైవర్‌ను స్థానిక పీహెచ్‌సీకి వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లగా, అక్కడి నుండి అతను పారిపోయాడు. ప్రస్తుతం పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టగా, లారీని స్టేషన్లో సీజ్ చేశారు.


Post Views: 143









