చెన్నూరులో ఎస్సీ బాయ్స్, గర్ల్స్ కాలేజి హాస్టల్ ఏర్పాటు చేయాలి –పి.సికిందర్, పి డి ఎస్ యు జిల్లా ఉపాధ్యక్షుడు

 

జనం పవర్/ చెన్నూరు మంచిర్యాల్ జిల్లా ఆగస్టు 11:

మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణ కేంద్రంలో ఎస్సీ బాయ్స్, గర్ల్స్ కాలేజ్ హాస్టల్ ఏర్పాటు చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ( పి డి ఎస్ యు ) ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో కలెక్టర్ కు వినతి పత్రం అందజేయడం జరిగింది. చెన్నూరు కిష్టంపేటలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో చదివే విద్యార్థులు కాలేజీ హాస్టల్ లేక ఇబ్బందులు అనేక ఎదుర్కొంటున్నారు. గర్ల్స్ కాలేజ్ హాస్టల్ లేక అమ్మాయిలు గ్రామీణ ప్రాంతాల నుండి రావాలంటే ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉన్నది. చెన్నూరులో కాలేజీ బాయ్స్ హాస్టల్ కొరకు బీసీ హాస్టల్ ఒక్కటే ఉన్నందున ఎస్సీ క్యాటగిరి విద్యార్థులకు ఇబ్బంది అవుతుంది. కావున విద్యార్థులు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చెన్నూరులో కాలేజీ హాస్టల్ ఏర్పాటు చేయాలని పి డి ఎస్ యు విద్యార్థి సంఘంగా కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యు జిల్లా ఉపాధ్యక్షుడు పి.సికిందర్, నాయకులు కె. కార్తీక్ పాల్గొన్నారు.

పి.సికిందర్
పి డి ఎస్ యు జిల్లా ఉపాధ్యక్షుడు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :