జనంపవర్, భీమదేవరపల్లి ఆగస్టు 11:
భీమదేవరపల్లి మండలంలో కొత్తగా పట్టాదారు పాస్ బుక్కులు పొందిన రైతులు ఈ నెల 13వ తేది లోగా దరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారిణి పద్మ ఓ ప్రకటనలో రైతులను కోరారు. జూన్ 5వ తేది వరకు పట్టా పాస్ బుక్ వచ్చిన వారు అలాగే అంతకుముందు దరఖాస్తు చేసుకోని వారు అప్లయ్ చేసుకోవాలని సూచించారు. కొత్త రైతులు పాసుబుక్ జిరాక్స్ లేదా తహసీల్దార్ సంతకం చేసిన డి ఎస్ పేపర్, రైతు ఆధార్ కార్డు, నామినీ ఆధార్ కార్డులతో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. అలాగే 1966 ఆగస్టు 14నుండి 2007 ఆగస్టు 14 తేది మధ్యలో జన్మించిన వారు మాత్రమే రైతు భీమాకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని పద్మ తెలిపారు
Post Views: 210









