దేవాపూర్ లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం
జనం పవర్,బెల్లంపల్లి: ఆగస్టు,11
రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, మంచిర్యాల డిసిపి ఏ.భాస్కర్ ఉత్తర్వుల మేరకు బెల్లంపల్లి ఏసిపి రవికుమార్ ఆదేశానుసారం సోమవారం ఉదయం 6 గం,, ల నుండి 8గం,, వరకు కాసిపేట మండలంలోని దేవాపూర్,గొల్లవాడ,రాంపూర్ గ్రామాలలో మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి, దేవాపూర్,కాసిపేట,మందమర్రి,రామకృష్ణాపూర్ ఎస్ ఐ లు, సిబ్బంది తో కలిసి కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ (కార్టన్ అండ్ సెర్చ్) నిర్వహించారు. ఎవరైనా అనుమానస్పద వ్యక్తులు ఈ ప్రాంతంలో ఉంటున్నారా లేదా, అపరచిత వ్యక్తులకు ఇక్కడ ఎవరైనా షెల్టర్ ఇస్తున్నారా అనే కోణంలో విచారిస్తూ ప్రతి ఒక్కరి ఆధార్ కార్డ్, గుర్తింపు కార్డ్ పరిశీలించారు. అదే విధంగా ఈ ప్రాంతంలో నివసించే వారి ద్విచక్ర వాహనాలు ఆర్ సి, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ లు పరిశీలించారు. సరియైన ద్రువపత్రాలు లేని, నెంబర్ ప్లేట్ లేని 45 ద్విచక్ర వాహనాలను గుర్తించి వాటిని అక్కడికక్కడే ఫైన్ వేశారు. నెంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి స్థానిక ప్రజలకు సైబర్ క్రైమ్,గంజాయి నియంత్రణ, సీసీ కెమెరాల ప్రాముఖ్యత, ట్రాఫిక్ రూల్స్, కోత్త చట్టాల పై మూడ నమ్మకాల గురించి అవగాహన కల్పించారు. వాహనదారులు హెల్మెట్ తప్పకుండా పెట్టుకోవాలని,ట్రాఫిక్ నిబంధన లను గూర్చి వివరించారు. గ్రామంలో నిర్వహించిన కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ లో భాగంగా గ్రామంలో బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న వారి పై, గుడుంబా అమ్ముతున్న వారి పై ఎక్సైజ్ కేసులు నమోదు చేశారు. ఈ కార్యక్రమం లో మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి, దేవాపూర్, కాసిపేట్ , రామకృష్ణాపూర్, ఎస్ ఐ లు, సిబ్బంది పాల్గొన్నారు.










