ఒక్కే మాట – ఒక్కే గమ్యం: పటిష్ఠమైన డీజేఎఫ్‌కు నూతన ప్రారంభం–మానసాని కృష్ణా రెడ్డి డీజేఎఫ్‌ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు

జనం పవర్ @ పెద్దపల్లి – ఆగస్టు 11:

డీజేఎఫ్‌ 5వ రాష్ట్ర మహాసభకు ముఖ్య అతిథిగా వచ్చిన తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమలు,శాసనసభా వ్యవహారాల మంత్రి గౌరవ దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు గారు, అతిథులుగా కార్యక్రమానికి హాజరైన గౌరవ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావుగారు,ఇతర ప్రముఖులు,పాత్రికేయులకు డీజేఎఫ్‌ జిల్లా,రాష్ట్ర,జాతీయ కమిటీ పక్షాన పేరుపేరునా వందనాలు.ఎన్నో ముఖ్యమైన కార్యక్రమాలున్నా వాటన్నింటిని రద్దు చేసుకుని మన కోసమే కార్యక్రమానికి హాజరైన మా శ్రేయోభిలాషులు,ఆత్మీయులు,మార్గదర్శి,స్ఫూర్తిదాత గౌరవ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు గారు మన పట్ల మరోమారు తన ప్రేమను,ఆప్యాయతను చాటుకోవడం మన సంఘానికి దక్కిన అతిపెద్ద గౌరవం. ఆయన ఒక్కడు మన సమావేశానికి హాజరయ్యాడంటేనే వేలాది మంది హాజరైనంత గొప్ప విజయం . ఇది మనందరం సాధించిన గొప్ప జయకేతనం. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా, వ్యతిరేక ప్రచారం చేసినా అనుకున్న లక్ష్యం సాధించాం. నకిలీ పాత్రికేయులు,చిన్న జర్నలిస్టు సంఘం అని ఎగతాళి చేసిన వారి చెంప చెళ్లుమనే సమాధానం ఆదివారం నాటి సభ ద్వారా దొరికొంది. డీజేఎఫ్‌లోనే ఉండి డీజేఎఫ్‌ సభ విఫలం కావాలని కుట్రలు పన్నినవారి కుట్రలన్నీ భగ్నం చేస్తూ సభ సూపర్‌ సక్సెస్‌ కావడానికి ఎందరో రాత్రింబవళ్ళు శ్రమించారు. రాష్ట్రం నలుమూలల నుంచి అన్ని జిల్లాల నుంచి ఈ సభకు ఎంతో శ్రమ తీసుకుని సకాలంలో సభకు హాజరై మన డీజేఎఫ్‌ సత్తా చాటిన ప్రతీ ఒక్కరికి, ఈ సభ విజయవంతానికి కృషి చేసిన మన శ్రేయోభిలాషులకు డీజేఎఫ్‌ జిల్లా,రాష్ట్ర,జాతీయ కమిటీల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.

…………………………………………………
అభినందనలతో
మీ..మానసాని కృష్ణా రెడ్డి
డీజేఎఫ్‌ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు
………………………………

 

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :