అనుబంధం, అనురాగం, ఆప్యాయత, ఆత్మవిశ్వాసం కలగలిసిన బంధమే రక్షాబంధన్-రక్షాబంధన్ సందర్భంగా చిన్న పెద్ద అనే తేడా లేకుండా సోదరులకు రాఖీ కడుతున్న సోదరీమణులు

జనం పవర్,పరకాల ఆగస్ట్ 09:

అనురాగం, అనుబంధం, ఆత్మవిశ్వాసం, ఆప్యాయత, సమపాళ్లలో కలిసిన బంధమే రక్తసంభంధం. ఎల్లలు లేని ప్రేమకు, వెలకట్టలేని విలువలకు ఇది ఒక చిహ్నం. కలిసిమెలిసి పెరిగినా..అల్లరి చేస్తూ గడిపినా..కష్టాల్లో తోడుగా నిలిచినా..సోదర, సోదరీమణుల ప్రేమ ఎప్పుడు త్యాగన్నే కోరుకుంటుంది. రాఖిపౌర్ణమిని పురస్కరించుకొని కష్ట సుఖాల్లో కంటికి రెప్పలా కాపాడుతూ..కలిసిమెలిసి ఉంటున్నా..తోబుట్టువులoదరికి చిన్న పెద్ద అనే తేడా లేకుండా రాఖిపౌర్ణమి సందర్భంగా వారి సోదరీమణులు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సోదరులు తమ సోదరీమణులకు విలువైన కానుకలు ఇచ్చి రక్షకులుగా కలకాలం తోడుగా ఉంటామని భరోసానివ్వడం గమనార్హం. హన్మకొండ జిల్లా పరకాల మండల కేంద్రంలో రక్షాబంధన్ వేడుకలు మండలంలోని ప్రజలు ఘనంగా జరుపుకోవడం విశేషం.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :