సోలార్ సౌర విద్యుత్ ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి * గ్రామపంచాయతీ భవనం నుంచి మొదలు సెక్రటేరియట్ వరకు అన్ని భవనాలపై సోలార్ పవర్ ప్లాంట్ లు * ఇందిరా సౌర గిరిజల వికాస పథకం అమలును వేగవంతం చేయాలి * ఏజెన్సీ ప్రాంత అధికారులు ఆర్ ఓ ఎఫ్ ఆర్ భూముల వివరాలు పంపండి  * రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క


జనం పవర్, భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 9:

సోలార్ సౌర విద్యుత్ ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి
* గ్రామపంచాయతీ భవనం నుంచి మొదలు సెక్రటేరియట్ వరకు అన్ని భవనాలపై సోలార్ పవర్ ప్లాంట్ లు
* ఇందిరా సౌర గిరిజల వికాస పథకం అమలును వేగవంతం చేయాలి
* ఏజెన్సీ ప్రాంత అధికారులు ఆర్ ఓ ఎఫ్ ఆర్ భూముల వివరాలు పంపండి
* రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కరాష్ట్రంలో సౌర విద్యుత్ ఉత్పాదకత దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శనివారం హైదరాబాద్ నుండి రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి(ఎనర్జీ) నవీన్ మిట్టల్, రెడ్ కో సిఎండి ఎస్.పి.డి.సి.ఎల్ సిఎండి సింగరేణి కాలరీస్ సిఎండిలతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సోలార్ సిస్టం ఇన్స్టాలేషన్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సౌర విద్యుత్ ఉత్పాదకత దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇందు కొరకు రాష్ట్రంలోని ప్రభుత్వ భవనాలు ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు కళాశాలలు ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములు ఆర్. ఓ. ఎఫ్. ఆర్ భూముల వివరాలతో నిర్ణీత నమూనా ప్రకారం నివేదిక రూపొందించి వారం రోజులలోగా సమర్పించాలని తెలిపారు. జిల్లాలలో గల ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు కళాశాలల భవనాల రూఫ్ టాప్ పై సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధ వహించి అన్ని జిల్లాల కలెక్టర్లు వారంలోగా సంబంధిత వివరాలను ఎనర్జీ డిపార్ట్మెంట్ కు పంపించాలని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాలలోని 6 లక్షల 17వేల ఎకరాలలో సోలార్ పంపుసెట్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఈ క్రమంలో 3 సంవత్సరాలలోపు ప్రక్రియ పూర్తి చేసే విధంగా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఐడిఓసి కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్  పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ  ప్రభుత్వ ఆదేశానుసారం జిల్లాలో సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు అనువైన ప్రభుత్వ కార్యాలయాలు పాఠశాలలు కళాశాలలు కాళీ ప్రభుత్వ స్థలాల వివరాలను నిర్ణీత నమూనాలో అందించేందుకు అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :