ఘనంగా యూత్ కాంగ్రెస్‌ 65వ ఆవిర్భావ దినోత్సవం

జనం పవర్,పెద్దపల్లి, ఆగస్టు 9 :

యూత్ కాంగ్రెస్‌ 65వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శుక్రవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బొంకూరి అవినాష్‌ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ఆవరణలో జెండా ఆవిష్కరించి, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీకే యూత్ కాంగ్రెస్‌ పిన్నముగా నిలుస్తోందని, పార్టీ ఇచ్చిన ప్రతి పిలుపునూ నిబద్ధతతో పాటిస్తుందని, యూత్ కాంగ్రెస్‌లో పనిచేసిన అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులుగా ఎదిగారని తెలిపారు. యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిస్తూ, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు రానున్న రోజుల్లో 30 శాతం టికెట్లు యువతకే ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అసెంబ్లీ అధ్యక్షుడు ముత్యాల నరేష్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లో విస్తృతంగా చేర్చడంలో కృషి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు భూషణ వేణి, సురేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి దొడ్డుపల్లి జగదీష్, మండల అధ్యక్షులు జడల రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుమలేష్, పట్టణ అధ్యక్షులు కొలిపాక శ్రావణ్, ఓదెల మండల అధ్యక్షులు రాహుల్, జూలపల్లి మండల అధ్యక్షులు దేవేందర్, రాకేష్, అయూబ్, నాంసాని శ్రీనివాస్, తూముల మహేష్, పవన్ కుమార్, కళ్యాణ్, మధుకర్, అనిల్, గంగుల వెంకటేష్, శ్రీనివాస్, నరేష్, తరుణ్ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :