రైల్వే ప్రయాణికుల కొరకు “కొదమ సింహం” పోరాటం మరువలేనిది

జనం పవర్, భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 9:

ప్రయాణికుల రైలు సౌకర్యం కొరకు కొవ్వూరు రైల్వే పోరాట సాధన కమిటీ కన్వీనర్ గా కొదమ సింహం పాండురంగ చార్యులు అందించిన సేవలు మరువలేనివని పలువురు యువకులు పేర్కొన్నారు. కొవ్వూరు రైల్వే సాధన కమిటీ కన్వీనర్ గా ఉండి కొత్తగూడెం రైల్వే స్టేషన్ అభివృద్ధికి కారకుడైన కొదమ సింహం పాండురంగచార్యులు జన్మదినం సందర్భంగా శనివారం స్థానిక గిరిజన యువత ఆయనకు ఘన సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొదమ సింహం కొవ్వూరు రైల్వే లైన్ కొరకు అనేక పోరాటాలు చేయడం జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రయాణికులకు సులభంగా దూరప్రాంతాలకు చేరుకునేందుకు ఇతర సౌకర్యాలు కల్పించాలని లక్ష్యంతో పోరాటం చేసిన వ్యక్తి కొదమ సింహం పాండురంగ చార్యులు అని కొనియాడారు. కొవ్వూరు రైల్వే లైన్ పనులు మొదలవుతున్నాయని రూ.21500 కోట్లతో  ఆంధ్రాలో ల్యాండ్ ఎక్విసన్ పనులు మొదలైనట్లుగా చెప్పారు. కొత్తగూడెం నుండి విజయవాడకు బూరుగూడెం నుండి కొండపల్లి వరకు 70 కిలోమీటర్లు సర్వే జరిగిందని పూర్తయితే విజయవాడ పోవడానికి కూడా సులభం అవుతుందని అందుకు ఆంధ్ర బిజెపి అధ్యక్షుడు మాధవ్ ని కలవబోతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భరత్ పవన్ కళ్యాణ్ ధర్మ చేతన్ సతీష్ గణేష్ హాతిరామ్ హేరామణి సుమన్ ఉదయ్ రాజు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :