జనం పవర్, భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 9:

రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆడపడుచుల ప్రయాణికులతో శనివారం కొత్తగూడెం బస్టాండ్ కిక్కిరిసిపోయింది. అన్నదమ్ములకు రాఖీలు కట్టేందుకు దూర ప్రాంతాల నుండి అక్కచెల్లెళ్ళు బస్సు ప్రయాణం ద్వారా కొత్తగూడెం బస్టాండుకు చేరుకుండవడంతో ఆ ప్రాంతమంతా సందడి వాతావరణం ఏర్పడింది. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో దీంతో మహిళలు ఎక్కువ సంఖ్యలో ప్రయాణం చేయడంతో రాఖీ ఎఫెక్ట్ కారణంగా కొత్తగూడెం బస్టాండ్ అంతా ఆడపడుచులతో నిండిపోయింది. బస్సులో సీట్లు దొరకని కారణంగా ఆడపడుచులంతా క్యూ కట్టి పోటీపడుతూ కనిపించింది. కొందరు మహిళలు అయితే సీటు కోసం తండ్లాడుకోవడం పరిస్థితి నెలకొంది. రాఖీ పౌర్ణమితో ఉదయం నుంచి సాయంత్రం వరకు మహిళలు కొత్తగూడెం బస్టాండ్ చేరుకోవడంతో ఎన్నడు లేనివిధంగా కళకళలాడుతూ సందడి వాతావరణం ఏర్పడింది. ఇదిలా ఉండగా ఉచిత బస్సు ప్రయాణం ఉండడం వల్లనే ఏడాది రాఖీ పౌర్ణమికి ఆడపడుచుల రాకపోకలు ఎక్కువ కావడం జరిగిందని పలువురు చర్చించుకోవడం గమనార్హం.









