
.జనం పవర్, నడికూడ ఆగస్టు 09:
నడికూడ మండలంలోని ధర్మారం గ్రామ పంచాయతీలో రాత్రయితే చాలు ఒకటో వార్డ్ రెండో వార్డ్ లో కన్నుపొడుచుకున్నా కనిపించదు. వీధులతోపాటు శివారు కాలనీల్లోనూ అంధకారం నెలకొంది. వీధిలైట్లు ఉన్నట్లు గ్రామంలో ఆనవాళ్లే కనిపించడం లేదు. కొత్తవి వేయించడం అటుంచితే.. చిన్నచిన్న మరమ్మతులు చేస్తే వెలిగే లైట్లు కూడా అలానే వదిలేశారు. సుమారు మూడు నెలల నుండి ఎటువంటి నిర్వహణ లేక వీధి దీపాలు పని చేయక అ కాలనీ ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మూడు నెలలుగా వీధి దీపాలు పని చేయకపోతుండటం గమనార్హం. ఆ కాలనీ వాసులు ఎప్పటికపుడు వీధి దీపాల మరమ్మతులపై గ్రామ లైన్మెన్ ప్రసాద్ కు విన్నవిస్తున్నా…అంతగా ఫలితం కనిపించటం లేదన్న అసంతృప్తులు వ్యక్తం అవుతున్నాయి. ఆ రెండు వీధుల సమస్య సమస్యతో కునారిల్లుతుండడంతో గ్రామ బాగోగులు పట్టించుకునే నాథుడే లేడని ప్రజలు విమర్శిస్తున్నారు. అడపాదడపా కురిసిన వర్షాలతో వర్షపు నీళ్లు నిల్వ ఉండడంతో, విషపురుగులు, సర్పాలు బయట సంచరిస్తుండడంతో రాత్రి ఏడు గంటలు అయితే చాలు వీధుల్లోకి రావాలంటేనే జనం భయపడుతున్నారు. కాలనీలో ఒక్కలైటు కూడా వెలగడం లేదని ఆయా కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీధిలైట్లువెలగక రోడ్లపై తిరిగే పరిస్థితి లేదని పలు కాలనీలవాసులు వాపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి గ్రామ పంచాయతీలోనీ ఆ కాలనీల వీధిలైట్లు బాగు చేయాలని, కొత్తవి బిగించాలని శివారు కాలనీ వాసులు కోరుతున్నారు.
లైన్మెన్ ట్టించుకోవడం లేదు: ధర్మారం కారోబార్ రాములు
మూడు నెలలుగా కాలనీలో దీపాలు వెలగడం లేదనేది వాస్తవమే నేను లైన్మెన్ ప్రసాద్ కు చెబుతున్నాం కాలనీలో చెట్లు అడ్డు వస్తున్నాయని వాటిని తొలగించాలని చెప్పారు తొలగించినా కూడా ఇప్పటివరకు కాలనీ సమస్య పై దృష్టి పెట్టలేదు









