జనం పవర్ పత్రికను ఆవిష్కరించిన కమాన్‌పూర్ పోలీస్‌ స్టేషన్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ కొట్టే ప్రసాద్‌

జనం పవర్ కమాన్‌పూర్ 09:

కమాన్‌పూర్ మండల కేంద్రంలోని పోలీస్‌ స్టేషన్‌లో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ కొట్టే ప్రసాద్‌ జనం పవర్ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పత్రికలు సామాజిక అవగాహన పెంపుదలలో, ప్రజా సమస్యల పరిష్కారంలో ముఖ్యపాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. నిజాయితీ, నిష్పక్షపాత ధోరణితో వార్తలను అందించటం ద్వారా పత్రికలు ప్రజా నమ్మకాన్ని గెలుచుకోవాలన్నారు. అలాగే, స్థానిక సమస్యలను వెలుగులోకి తెచ్చి పరిష్కార మార్గాలను సూచించడం ద్వారా సమాజ అభివృద్ధికి తోడ్పడాలని ఆయన సూచించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :