మున్సిపల్ ఎన్నికల్లో బిజెపిని ఆదరించాలి

జనం పవర్, వనపర్తి, ఆగష్టు 07 :

వనపర్తి పట్టణంలో 24వ వార్డు పీర్లగుట్ట,బండార్ నగర్ కాలనీ బిజెపి పట్టణ అధ్యక్షులు రాజశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో బిజెపి ప్రభుత్వం 11 ఏళ్ల పాలనలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లతో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెపి జిల్లా అధ్యక్షులు డి నారాయణ మాట్లాడుతూ 60 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి అక్రమాలకు నిరక్షరాసులను గురిచేసిందని తెలియజేయడం జరిగింది.

24వ వార్డు బిజెపి కౌన్సిలర్ అభ్యర్థి తిరుమలేష్ మాట్లాడుతూ

నరేంద్ర మోడీ 11 ఏళ్ల పానాలలో 24వ వార్డులో అభివృద్ధికి 14 ఫైనాన్స్ కింద సీసీ రోడ్లు డ్రైనేజ్ కొరకు 11 లక్షల రూపాయలు కేంద్రం నిధులు ఇవ్వడం జరిగింది. 15 ఫైనాన్స్ కింద సిసి రోడ్లు డ్రైనేజీ కొరకు 16 లక్షల రూపాయలు కేంద్రం నిధులు ఇవ్వడం జరిగింది.15త్ ఫైనాన్స్ కింద 24 వ వార్డులో మహిళా కమ్యూనిటీ భవనం కోసం 16 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది.15 ఫైనాన్స్ కింద రిటైర్ టీచర్ల ఉద్యోగుల సంఘం కార్యాలయానికి ఆరు లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది.

14,15 ఫైనాన్స్ కమిషన్ కింద ప్రజాకవి కాళోజి పార్కు అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించడం జరిగింది. 24వ వార్డులో కరోనా సమయంలో చిరు వ్యాపారుల కోసం పదివేల రూపాయలు లోన్లు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది.గత పాలకుల వల్ల రాష్ట్రం నుంచి ఎటువంటి నిధులు తీసుకురాకుండా అభివృద్ధి కుంటూ పడడం జరిగింది అధికారం లేకున్నా వార్డులో కేంద్ర ప్రభుత్వం నుంచే అభివృద్ధి జరిగింది కావున రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో బిజెపిని ఆదరిస్తే 24 వ వార్డు అభివృద్ధికి ఇంకా శక్తివంతంగా తయారవుతుంది అన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి ఓబీసీ అధికార ప్రతినిధి శ్రీశైలం, పార్లమెంట్ ఫుల్ కేతూరి బుడ్డన్న, అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్ గౌడ్ మాజీ కౌన్సిలర్ సుమిత్రమ్మ, పట్టణ ప్రధాన కార్యదర్శి సుగురు రాములు,దంతోజి నవీన్ కుమార్, ఓబీసీ మోర్చా జిల్లా నాయకులు కాటమొని కృష్ణ గౌడ్,రాయన్న సాగర్, విజయ్ కుమార్, మోహన్ సాగర్ ఓబిసి పట్టణ అధ్యక్షులు రవి,పట్టణ ఉపాధ్యక్షులు ఉందకోటి అంజి, ఉపేందర్ , చందు,శివ, చేన్నరాయుడు 24వ వార్డ్ భూత అధ్యక్షులు నీలేష్ సింగ్, నంద,కార్తీక్, పులిపాటి అంజి, గుంటి శివకుమార్ సాగర్ పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :