బిసిఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమం

బిసిఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమం

జనం పవర్, వనపర్తి,ఆగస్ట్ 7 :

వెనుకబడిన కులాల సమాఖ్య బిసిఎఫ్ ప్రాథమిక క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం వనపర్తి పట్టణంలోని బాలానగర్లో ప్రారంభమైంది . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిసిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నాగనమోని చెన్నరాములు ముదిరాజ్ హాజరైనారు. పుట్టపాకుల బాలస్వామి మొదటి సభ్యత్వం తీసుకున్నారు . వరుసగా బిసిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అల్లాడి భగవంతు గౌడ్ , కే వెంకటేశ్వర్లు , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం రామన్ గౌడ్ మాజీ ఎంపీటీసీ, రాష్ట్ర కార్యదర్శి ఏర్పుల తిరుపతి యాదవ్, జిల్లా అధ్యక్షులు పెళ్లి విల్లా తిరుపతయ్య యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు వి . సురేందర్ బాబు, వనపర్తి పట్టణ నాయకులు బొడ్డుపల్లి మన్నెం, ఉందేకోటి బీసన్న , ఉందేకోటి వెంకటస్వామి , బొడ్డుపల్లి కుమార్ ,బొడ్డుపల్లి తిరుపతయ్య సభ్యత్వం తీసుకున్న వారిలో ఉన్నారు . ఈ సందర్భంగా చెన్న రాములు ముదిరాజ్ మాట్లాడుతూ గత 78 సంవత్సరాలుగా హక్కులు ఆత్మగౌరవం అధికారం విద్య ఉద్యోగం ఉపాధి లేకుండా దారిద్రరేఖకు దిగువన జీవిస్తున్న బీసీలు కులవృత్తులను నమ్ముకొని జీవన విధ్వంసమై ఆకలి చావులు, ఆత్మహత్యలు వలస చావులు నిత్య కృత్యం అయినాయి . కాబట్టి కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం మాటకు కట్టుబడి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయించి తీర్మానించి రాష్ట్రపతి దగ్గరికి పంపించడం జరిగింది. కేంద్రంలోని బిజెపి పార్టీ పార్లమెంటులో బిల్లును ఆమోదం చేసి రాజ్యాంగ సవరణ ద్వారా 9వ షెడ్యూల్లో చేర్చి చట్టబద్ధమైన రిజర్వేషన్లు ఇవ్వాల్సి ఉంది కానీ బిజెపి ఏవో కుంటి సాకులు చెబుతూ కాపీ వేస్తున్నారు కాబట్టి వీరిపై వర్థిలు తీసుకురావడానికి ఢిల్లీలో ఈనెల 5,6,7 తేదీల్లో కాంగ్రెస్ పార్టీ 72 గంటల దీక్ష చేపట్టారు. కాబట్టి ఇప్పటికైనా బిజెపి దేశవ్యాప్తంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టి ఇవ్వాలి అన్నారు. గ్రామ గ్రామంలో బీసీలు చైతన్యమై ఎక్కడికక్కడ ఉద్యమాలు చేస్తే తప్ప ఈ అగ్రకుల ఆధిపత్యం లోని పార్టీలు ఆమోదించమని ఈ సందర్భంగా గుర్తు చేశారు అదేవిధంగా తెలంగాణ రాబిన్ ఫుడ్ పేద ప్రజలకు పెన్నిధి ప్రజా బంధువు పండుగ సాయన్న విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై పెట్టాలని అదేవిధంగా పండుగ సాయన్న జయంతి వర్ధంతిలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :