భక్తిశ్రద్ధలతో ఘనంగా జయంతి ఉత్సవాలు

జనం పవర్, కమాన్‌పూర్‌ ఆగస్టు 7:

కమాన్‌పూర్‌ మండల కేంద్రంలోని ప్రసిద్ధ ఆదివరాహ స్వామి దేవాలయంలో జయంతి ఉత్సవాల చివరి రోజు వేడుకలు 07-08-2025 గురువారం ఘనంగా నిర్వహించబడ్డాయి. ఉదయం 8:30 గంటల నుండి స్వామివారికి నిత్యాభిషేకం, గోపూజలు వైభవంగా జరిగాయి.
తదనంతరం ఉదయం 9 గంటలకు వరాహ జయంతిని పురస్కరించుకుని అష్టోత్తర శతఘటాభిషేక మహోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించబడింది. 108 పవిత్ర కళశాలతో స్వామివారికి ఘటాభిషేకం నిర్వహించడం విశేషం.
మధ్యాహ్నం 12:30 గంటలకు ఆదివరాహ స్వామివారికి భక్తులు సమర్పించిన వెండి కవచాన్ని అలంకరించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రధాన అర్చకులు వరప్రసాదాచార్యులు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అనంతరం జరిగిన మహాప్రసాద వితరణలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందారు. ఈ పవిత్ర కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఈవో శ్రీ కే. కాంతారెడ్డి, కమాన్‌పూర్‌ మండల తహసీల్దార్ శ్రీమతి వాసంతి, ఆర్ఐ స్రవంతి, ఎస్సై కొట్టే ప్రసాద్, పలువురు ప్రజాప్రతినిధులు, భక్తజనం పెద్దఎత్తున పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :