అసభ్యకర వీడియోల కేసులో వ్యక్తి అరెస్ట్
జనం పవర్,నస్పూర్, ఆగస్టు 06
నస్పూర్‌లో చిన్నారుల అసభ్యకర వీడియోల కేసులో వ్యక్తి అరెస్ట్
ఇంస్టాగ్రామ్ లో వీడియోలు షేర్ చేసిన కర్రు సందీప్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు
చిన్నారుల అసభ్యకరమైన వీడియోలను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ అయిన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన కేసులో నస్పూర్ మండలానికి చెందిన కర్రు సందీప్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ & ఎక్సప్లటెడ్ చిల్డ్రన్ (ఎన్ సి మ్ ఇ) సంస్థ గుర్తించి, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ విభాగానికి సమాచారం అందించింది.
అనంతరం, సైబర్ సెక్యూరిటీ వింగ్ అందించిన సమాచారంపై స్పందించిన నస్పూర్ పోలీసులు సైబర్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మంచిర్యాల రూరల్ ఇన్స్పెక్టర్ ఏ. అశోక్ నేతృత్వంలో జరిపిన విచారణలో సరైన ఆధారాలు సేకరించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ ఏ. అశోక్ మాట్లాడుతూ – “ఇంటర్నెట్‌లో చిన్నారుల అసభ్యకరమైన విషయాలపై వెతకడం, వాటిని షేర్ చేయడం, ఫార్వర్డ్ చేయడం, ప్రచారం చేయడం లాంటివి అత్యంత తీవ్ర నేరాలు. ఇటువంటి చర్యలు చేసిన ప్రతి ఒక్కరిపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ వింగ్ కఠినంగా స్పందించి, చట్టరీత్యా చర్యలు తీసుకుంటుంది” అని హెచ్చరించారు.
ఈ కేసుకు సంబంధించి ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో సీఐపి ఏ. అశోక్‌తో పాటు నస్పూర్ సబ్-ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ యూ. ఉపేందర్ రావు పాల్గొన్నారు.
సామాజిక మాధ్యమాల్లో బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని, అసభ్యకరమైన విషయాలను దూరంగా ఉంచాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.









