ఘనంగా రేణుక ఎల్లమ్మ వార్షికోత్సవ పండగ

 

జనం పవర్, జుక్కల్ ఆర్ సి ప్రతినిధి దయానంద్ నవంబర్ 30 :


కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని చిన్న దడిగి గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో 11వ వార్షికోత్సవ పండగను గ్రామస్తులు ఉదయం నుంచి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి మహిళలు తలపై బోనాలు ఎత్తుకొని ఊరేగింపుగా బయలుదేరి అమ్మవారికి సమర్పించారు. ప్రతి సంవత్సరం ఇలాగే అమ్మవారికి ఆలయాన్ని పూలతో అలంకరించి పురాతన ధ్వజ స్తంభానికి నూతన జెండాను కట్టారు. అమ్మవారికి అభిషేకాలు నైవేద్యాలు సమర్పించి హారతి అందించారు.అనంతరం వచ్చిన భక్తులకు మహా అన్నదాన వితరణ కార్యక్రమం నిర్వహించారు. గ్రామానికి చెందిన సంతా గౌడ్ అమ్మవారికి కళ్ళు ఘటం సమర్పించారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కాంగ్రెస్ పిసిసి డెలిగేట్ విట్టల్ రెడ్డి, సంత గౌడ్,గ్రామ మాజీ సర్పంచ్ అనిత వితల్ రెడ్డి, మాజీ సర్పంచ్ నారాయణ, విజయ్ భాస్కర్ రెడ్డి,కిష్ట రెడ్డి, బూమ్ బోయి,శాంతాపూర్ సాయిలు తదితరులు భక్తులు గ్రామస్తులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :