జనం పవర్,పెద్దపల్లి/రామగిరి నవంబర్ 29:
రామగిరి మండల కేంద్రంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో శనివారం నిర్వహించిన స్టూడెంట్ లీడ్ కాన్ఫరెన్స్ కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. విద్యార్థులు సృజనాత్మకతకు వేదికగా నిలిచిన ఈ కార్యక్రమంలో చిన్నారులు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంపై తమ అవగాహనను ప్రతిబింబిస్తూ అనేక వినూత్న ప్రాజెక్టులను ప్రదర్శించారు.
తమ పిల్లల ప్రతిభను ప్రత్యక్షంగా చూడడానికి వచ్చిన తల్లిదండ్రులు ప్రతి ప్రాజెక్టును ఆసక్తిగా పరిశీలించారు. విద్యార్థులు చూపిన నైపుణ్యం, ప్రాజెక్టులలోని వినూత్నతపై వారు ప్రశంసలు కురిపించారు. విద్యార్థుల్లో పరిశోధనా దృక్పథాన్ని పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని అభిప్రాయపడారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను స్కూల్ యాజమాన్యం అభినందించింది. విద్యార్థుల ప్రతిభను వెలుగులోనికి తీసుకొచ్చే కార్యక్రమాలు భవిష్యత్‌లో కూడా కొనసాగుతాయని స్కూల్ యాజమాన్యం తెలిపారు.









