జనం పవర్ | గంగాధర | నవంబర్ 17
గంగాధర మండలం కురిక్యాల గ్రామానికి చెందిన భీమనాతిని సత్యవ్వ అనే మహిళ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. గంగాధర మండలంలో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల కోసం వెళుతున్న సందర్భంగా ప్రమాదాన్ని గమనించిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వెంటనే తన వాహనాన్ని నిలిపివేశారు.
గాయపడిన మహిళను పరిశీలించి, ఆలస్యం కాకుండా స్థానిక పోలీసుల వాహనంలోనే కరీంనగర్ ఆసుపత్రికి తరలించేలా స్వయంగా పర్యవేక్షించారు. అనంతరం ఆసుపత్రి వైద్యులతో ఫోన్‌లో మాట్లాడి, ఆమెకు తక్షణం మెరుగైన వైద్యం అందించేలా ఆదేశించారు.
ప్రమాదంలో గాయపడిన మహిళను స్వయంగా ఆసుపత్రికి తరలించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మానవత్వానికి నిదర్శనమని మండల ప్రజలు అభినందించారు.

Post Views: 289









