జనం పవర్ గంగాధర నవంబర్14:
తల్లిదండ్రులు తమ పిల్లలతో స్నేహపూర్వకంగా ఉండి, వారికి చదువులో ప్రోత్సాహం అందించాలని ప్రధానోపాధ్యాయులు డా. యెలిగేటి మల్లికార్జున్ అన్నారు. తెలంగాణ విద్యాశాఖ ఆదేశాల మేరకు ఈరోజు బూరుగుపల్లి జడ్పిహెఎస్ పాఠశాలలో (పేరెంట్స్ –టీచర్స్ మీటింగ్ నిర్వహించారు.
ఈ సమావేశంలో ఎస్ ఏ -1 ఫలితాల సమీక్ష చేపట్టి, విద్యార్థుల చదువు, వారి క్రమశిక్షణ, మరియు వెనుకబడిన విద్యార్థులపై తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు.
ఈ సందర్భంలో హెఎం మల్లికార్జున్ గారు మాట్లాడుతూ—
తల్లిదండ్రులు ప్రతిరోజూ కనీసం ఒక పూట పిల్లలతో కలిసి భోజనం చేస్తూ, వారి చదువుపై ఆసక్తి, అవసరాలు తెలుసుకోవాలని సూచించారు. అలాగే సెల్ఫోన్ మరియు సోషల్ మీడియాలో అలవాటు విద్యార్థుల చదువుపై ప్రతికూల ప్రభావం చూపుతున్నందున, పిల్లలను వాటి నుండి దూరంగా ఉంచాలని కోరారు.
ఈ కార్యక్రమానికి సుమారు 108 మంది తల్లిదండ్రులు హాజరయ్యారు. AAPC చైర్పర్సన్ శ్రీమతి కస్తూరి మాధవి గారితో పాటు నగేష్, విజయకుమార్, లక్ష్మీరాజం, జగదీశ్వరి, భూమయ్య, మంజుల, రాయమయ్య, రాజబాబు, మల్లేశం, సత్యనారాయణ, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.









