*జనం పవర్, హుజురాబాద్ నవంబర్ 10*
జమ్మికుంటలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం తర్వాత 26 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు కడుపునొప్పితో బాధపడడంతో ఉపాధ్యాయులు వెంటనే వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు .ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి నిలకడగానే ఉంది .కాగా, మధ్యాహ్నం భోజనంలో పెట్టిన గుడ్లు వాసన వచ్చాయని అన్నంలో పురుగులు ఉన్నాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు విచారిస్తున్నారు. ఈ ఘటనపై బండి సంజయ్, పొన్నం ప్రభాకర్, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రణవ్ బాబు, బిజెపి నాయకులు ఫుడ్ పాయిజన్ కు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Post Views: 256









