జనం పవర్, వరంగల్ | నవంబర్ 9 :
డెమోక్రటిక్ జర్నలిస్టు ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో నిర్వహించిన *వర్కింగ్ ఓరుగల్లు సభ* విజయవంతంగా ముగిసింది. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ — *“జర్నలిస్టులు సమాజానికి అద్దం పట్టే శక్తి. వారి పాత్ర కీలకం. జర్నలిస్టులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు నా వంతు సహాయం అందిస్తాను,”* అని పేర్కొన్నారు.
జాతీయ అధ్యక్షుడు మానసాని కృష్ణారెడ్డి మాట్లాడుతూ, *“డెమోక్రటిక్ జర్నలిస్టు ఫెడరేషన్‌కు చెందిన ప్రతి సభ్యుడికి ₹10 లక్షల ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించబడుతుంది. జర్నలిస్టులు ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉండాలి — అదే నిజమైన సేవ”* అని అన్నారు.
రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం కోసం నిరంతర పోరాటం కొనసాగుతుందని తెలిపారు. రాష్ట్ర నాయకులు జిల్లాల ఇన్‌ఛార్జీలుగా నియమితులై ఆయా జిల్లాల కమిటీలను త్వరితగతిన ఏర్పాటు చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురపాక రాజు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లయ్య మహర్షి, వివిధ జిల్లాల రాష్ట్ర–జిల్లా నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.









