జనం పవర్ గంగాధర నవంబర్ 8:
కరీంనగర్ జిల్లా బూరుగుపల్లి గ్రామంలోని జడ్పిహెచ్ఎస్ విద్యార్థులు తమ ప్రతిభను చాటుతూ నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిట్స్ ప్రదర్శన నిన్న ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ ఈ ప్రదర్శనను సందర్శించి విద్యార్థుల సృజనాత్మకత, శాస్త్రీయ ఆలోచనలను అభినందించారు.
విద్యార్థులు పర్యావరణ పరిరక్షణ, పునర్వినియోగ శక్తి వనరులు, సాంకేతిక ఆవిష్కరణలపై రూపొందించిన మోడళ్లు గవర్నర్ గారిని ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను మరింత కృషి చేసి శాస్త్ర సాంకేతిక రంగంలో ముందుకు సాగాలని ప్రోత్సహించారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, కరీంనగర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ , అడిషనల్ కలెక్టర్ పాల్గొని విద్యార్థులను ఉత్సాహపరిచారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అధ్యాపకులు, పాల్గొని విద్యార్థులను అభినందించారు.
Post Views: 277









