జనం పవర్, నవంబర్ 08:మహబూబాబాద్ జిల్లా, నెల్లికుదూరు,సీతారాంపురం గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబం గొల్లపల్లి హరీష్ కుటుంబానికి ఇప్పటి వరకు ప్రభుత్వం ద్వారా ఇల్లు మంజూరు కాని దురదృష్టకర పరిస్థితి ఉందని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర యువ నాయకులు వరిపల్లి అనిల్ కుమార్ తెలిపారు.
ఈ నేపథ్యంలో హరీష్ కుటుంబానికి తక్షణమే ఇళ్లు మంజూరు చేయాలని అడిషనల్ కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం సమర్పించానని అడిషనల్ కలెక్టర్ కూడా త్వరలో విచారణ చేసి కచ్చితంగా ఇళ్లు మంజూరు చేస్తామని, హామీ ఇచ్చారని తెలిపారు.
గ్రామంలో అర్హత కలిగిన కుటుంబాలకు ఇళ్లు అందకపోవడం చాలా బాధాకరమని ఆయన అన్నారు.
హరీష్ కుటుంబానికి ఇళ్లు మంజూరు అయ్యే వరకు టి ఆర్ పి కృషి చేస్తుంది,వారి కుటుంబానికి భరోసాగా టి ఆర్ పి పార్టీ అండగా ఉంటుందనీ వరిపల్లి అనిల్ కుమార్ అన్నారు.
Post Views: 199









