జనం పవర్, కరీంనగర్ – నవంబర్ 8:
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని తీగలగుట్టపల్లి రెండవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకుడు కోలగాని అనిల్ చిన్నారుల మధ్య కేక్ కట్ చేసి వేడుకలను జరిపారు.
ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. పేదల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న మహానేతగా ఆయనను అభివర్ణించారు. రేవంత్ రెడ్డి సంపూర్ణ ఆయురారోగ్యాలతో రాష్ట్రాభివృద్ధి దిశగా మరింత సేవలు అందించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో వంశీ, నరేష్, వెంకటేష్, రాజు, కుమార్, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.

Post Views: 107









