కరీంనగర్ ఉమ్మడి జిల్లా పాఠశాల క్రీడల సంఘం ఆధ్వర్యంలో జరిగిన కరాటే పోటీల్లో 29 పతకాలు సాధించారు
జనం పవర్, జగిత్యాల, అక్టోబర్ 14:
గోదావరిఖని పట్టణంలోని ఆర్సి క్లబ్లో కరీంనగర్ ఉమ్మడి జిల్లా పాఠశాల క్రీడల సంఘం ఆధ్వర్యంలో పద్నాలుగు, పదిహేడు సంవత్సరాల వయస్సు గల బాలురు, బాలికల విభాగాల్లో కరాటే పోటీలు ఘనంగా నిర్వహించబడినవి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్సి క్లబ్ ప్రధాన అధికారి ఆర్. జీవన్, విద్యా శాఖాధికారి జింక మల్లేశం, పెద్దపెల్లి జిల్లా క్రీడల సంఘం కార్యదర్శి కె. లక్ష్మణ్, కొమురోజు శ్రీనివాస్, శారీరక విద్య ఉపాధ్యాయులు, కరాటే గురువులు హాజరై పోటీలను ప్రారంభించారు. జగిత్యాల జిల్లా విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరచి మొత్తం ఇరవై తొమ్మిది పతకాలు సాధించారు. అందులో ఏడు బంగారు, పన్నెండు వెండి, పది రాగి పతకాలు సాధించి జిల్లా కీర్తిని పెంచారు. జగిత్యాల జిల్లా పాఠశాల క్రీడల సంఘం కార్యదర్శి చక్రధర్ రావు, కరాటే శిక్షకులు లింగయ్య, ఆరు ముళ్ల పవన్, శ్రీనివాస్, నరేష్, ఆకాష్ తదితరులు విజేత విద్యార్థులను అభినందించారు.









