*జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా, బ్యాట్మెంటన్ పోటీల్లో విజేతలు గా నిలిచిన పోలీస్ టీం*విజేతలను అభినందించిన జిల్లా ఎస్పి అశోక్ కుమార్ ఐపిఎస్

*జనం పవర్, జగిత్యాల, సెప్టెంబర్ 22*

జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకొని శనివారం జగిత్యాల మినీ స్టేడియంలో, జిల్లా క్రీడలు, యువజన శాఖ ఆధ్వర్యంలో,నిర్వహించిన క్రీడ పోటీల్లో,క్రికెట్,బ్యాట్మెంటన్ పోటీల్లో విజేతలు గా నిలిచిన పోలీస్ టీం సిబ్బందిని,ఈరోజు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం లో, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపిఎస్,ను, మర్యాదపూర్వకంగా కలవడం జరిగిందని,ఈ సందర్భంగా క్రికెట్ లో మొదటి బహుమతి సాధించిన టీం కెప్టెన్ వినోద్ రెడ్డిని,జట్టు సభ్యులను, బ్యాట్మెంటన్ పోటీ లో విజేతగా నిలిచిన కానిస్టేబుల్ రాజేందర్ ను ఎస్పీ అభినందించ్చి,మాట్లాడుతూ,క్రీడలు మన శారీరక ఆరోగ్యానికి బలాన్ని, అందించడమే కాకుండా, మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి అని, క్రీడలతో మనలో పోటీ భావన పెరుగుతుందని,అలాగే సహచరులను ప్రోత్సహించే స్ఫూర్తి కూడా వస్తుందని, క్రీడల్లో ప్రతిభ చూపిన సిబ్బంది భవిష్యత్తులో రాష్ట్ర, జాతీయ స్థాయిలోనూ,రాణించాలని తెలిపినారని, ఎస్పీ ని,కలిసిన వారిలో  రిజర్వ్  సబ్ ఇన్స్పెక్టర్లు వినోద్ రెడ్డి, దినేష్, సుమన్, ఇతర పోలీస్ సిబ్బంది ఉన్నారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :