*జనం పవర్ జగిత్యాల రూరల్ సెప్టెంబర్ 22*
జగిత్యాల రూరల్ మండలం హన్మాజిపేటలో సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది గాయపడ్డారు. పోరండ్ల బాలపెల్లి గ్రామానికి చెందిన వీరంతా జగిత్యాల పట్టణంలో దుర్గదేవి శోభాయాత్రకు వస్తుండగా, వారి ప్రయాణిస్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టింది. క్షతగాత్రులను జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, ఇద్దరి పరిస్థితి విషమించడంతో కరీంనగర్ కు తరలించినట్లు సమాచారం.
Post Views: 29









