గంగాధర, సెప్టెంబర్ 22 (జనం పవర్):
గంగాధర మండలం మంగపేట గ్రామానికి చెందిన దళిత కుటుంబానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లింగాల హరిప్రసాద్ అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
హైదరాబాద్‌లో ఉన్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం స్థానిక నాయకుల ద్వారా విషయం తెలుసుకుని, హరిప్రసాద్ మృతికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. అంత్యక్రియల నిమిత్తం తక్షణ సహాయంగా రూ.10,000/-ను మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల ద్వారా భాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.
Post Views: 52









